విశాఖ బాధితులను డిశ్చార్జి చేసేందుకు చర్యలు

విశాఖ ఘటనలో బాధితులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల విశాఖపట్నం సమీపంలోని ఆర్‌ఆర్‌

Updated : 11 May 2020 11:28 IST

విశాఖపట్నం: విశాఖ ఘటనలో బాధితులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల విశాఖపట్నం సమీపంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలో ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకై వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బాధితులంతా విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.అర్జున తెలిపారు. పరిస్థితి మెరుగవడంతో డిశ్చార్జి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో ఉన్న వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే డిశ్చార్జి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గురువారం తెల్లవరుజామున ఎల్జీ పాలిమర్స్‌ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనలో 12మంది మృతి చెందగా వందలాది మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్టైరీన్‌ ఆవిర్ల ప్రభావంతో మనుషులతోపాటు జంతువులు, పాములు, ఎలుకలు, పిల్లులు, కుక్కలు ఎక్కడ పడితే అక్కడ పిట్టల్లా రాలి చనిపోయాయి. ఈ ఘటనలో పచ్చని చెట్లు సైతం ఎండిపోయాయి. 

ఇదీ చదవండి..
జీవముప్పు!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని