20 నిమిషాల్లోనే రైలు టికెట్లు ఖాళీ

దేశవ్యాప్తంగా వివిధ స్టేషన్ల మధ్య మంగళవారం నుంచి (నేటి నుంచి) పరుగులు పెట్టనున్న 15 రైళ్లకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో

Updated : 17 Sep 2022 16:33 IST

హావ్‌డా-దిల్లీ రైలు టికెట్లను కొనేసిన ప్రయాణికులు

దిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ స్టేషన్ల మధ్య మంగళవారం నుంచి (నేటి నుంచి) పరుగులు పెట్టనున్న 15 రైళ్లకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో సోమవారం సాయంత్రం ఆరుగంటలకు మొదలయ్యాయి. వాస్తవానికి సాయంత్రం నాలుగు గంటలకే విక్రయాలు మొదలవుతాయని ఆదివారం ప్రకటించినా, వెబ్‌సైట్లో సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలు ఆలస్యం అయింది. హావ్‌డా-దిల్లీల మధ్య నడిచే రైలులో ఏసీ-1, ఏసీ-3 టికెట్లన్నీ కేవలం పది నిమిషాల వ్యవధిలో, మిగిలిన అన్ని టికెట్లు 20 నిమిషాల వ్యవధిలో అయిపోయాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి దిల్లీ వెళ్లే రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు 6.30 గంటలకల్లా (30 నిమిషాల వ్యవధిలో) అయిపోయాయి. మరోవైపు, వెబ్‌సైట్‌ క్రాష్‌ అయిందని వచ్చిన వార్తలను రైల్వే వర్గాలు ఖండించాయి. క్రాష్‌ కాలేదని స్పష్టంచేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని