తెలంగాణలో ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభం

తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియెట్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. గన్‌ఫౌండ్రీలోని మహబూబియా కళాశాలలో ఏర్పాటు చేసిన

Updated : 12 May 2020 11:44 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియెట్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. గన్‌ఫౌండ్రీలోని మహబూబియా కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో సిబ్బంది ఈ ఉదయం విధులకు హాజరయ్యారు.  ముందుగా రెండో సంవత్సరం, ఆతర్వాత మొదటి సంవత్సరం సమాధాన పత్రాల మూల్యాంకనం కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో మూల్యాంకన కేంద్రాలను 12 నుంచి 33కి పెంచారు.
మొత్తం 9.50లక్షల మంది విద్యార్థులకు చెందిన 55 లక్షల జవాబు పత్రాలను 15వేల మంది అధ్యాపకులు మూల్యాంకనం చేయనున్నారు. కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుంటూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రవాణా, వసతి సదుపాయాలు కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. ఒక్కో ఉద్యోగికి 3 మాస్క్‌లు, వ్యక్తిగత శానిటైజర్లు, పోలీసు పాస్‌లు అందజేశారు. మూల్యాంకన కేంద్రాల్లో రోజూ శానిటైజేషన్‌, ఫాగింగ్‌ చేపట్టనున్నారు. జూన్‌ రెండో వారంలో ఇంటర్‌ ఫలితాలు ప్రకటించే అవకాశముంది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని