ఎయిమ్స్‌ నుంచి మన్మోహన్‌ సింగ్ డిశ్చార్జ్‌

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అనారోగ్యం నుంచి ఆయన పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన్ను డిశ్చార్జ్‌ చేసినట్లు ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి.....

Published : 12 May 2020 16:51 IST

దిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆయన పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన్ను డిశ్చార్జ్‌ చేసినట్లు ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి. 87 ఏళ్ల మాజీ ప్రధాని ఆదివారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం ఆయన్ను అదే రోజు ఎయిమ్స్‌కు తరలించారు. ఓ నూతన ఔషధాన్ని తీసుకోవడంతో ఆయనకు జ్వరం రావడంతో....  ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. సోమవారం ఆయన పరిస్థితి మెరుగుపడటంతో ఆయన్ను  ఐసీయూ  వార్డుకు మార్చారు. అలానే ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మన్మోహన్‌ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. మన్మోహన్‌ త్వరగా కోలుకోవాలని పలువురు నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆకాంక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని