45,533 టికెట్లు బుక్‌ చేసుకున్నారు!

దిల్లీ నుంచి 15 మార్గాల్లో రైల్వే బోర్డు ప్రారంభించిన సర్వీసుల కోసం రూ. 16 కోట్ల విలువైన 45,533 టికెట్లను ప్రయాణికులు బుకింగ్‌ చేసుకున్నారు. లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుండగా.. మొదటి రైలు దిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌కు బయల్దేరనుంది. ప్రయాణికుల కోసం సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి బుకింగ్‌ ప్రారంభించనుండగా..

Updated : 12 May 2020 22:41 IST

దిల్లీ: దిల్లీ నుంచి 15 మార్గాల్లో రైల్వే బోర్డు ప్రారంభించిన సర్వీసుల కోసం రూ. 16 కోట్ల విలువైన 45,533 టికెట్లను ప్రయాణికులు బుకింగ్‌ చేసుకున్నారు. లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు మంగళవారం నుంచి తిరిగి ప్రారంభం కాగా,.. మొదటి రైలు దిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌కు బయలుదేరింది. ప్రయాణికుల కోసం సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి బుకింగ్‌ ప్రారంభించగా... వచ్చే వారం రోజులకు ఇప్పటివరకు 82 వేల మంది టికెట్లను బుకింగ్‌ చేసుకున్నారు. మంగళవారం నుంచి నడిచే 15 ప్రత్యేక రైళ్లకు రైల్వేశాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణికులు ఆరోగ్య పరీక్షల నిర్వహణకు వీలుగా 90 నిమిషాల ముందే స్టేషన్‌కు రావాలని సూచించింది. దీనితోపాటు ఆరోగ్య సేతు యాప్‌ని విధిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని