సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సందడి

దాదాపు 45 రోజుల తర్వాత సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సందడి కనిపించింది. లాక్‌డౌన్‌ వేళ కేంద్రం ఇచ్చిన సడలింపులతో రైల్వేశాఖ

Updated : 13 May 2020 13:39 IST

హైదరాబాద్‌: దాదాపు 50 రోజుల తర్వాత సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సందడి కనిపించింది. లాక్‌డౌన్‌ వేళ కేంద్రం ఇచ్చిన సడలింపులతో రైల్వేశాఖ ప్రత్యేకంగా కొన్ని రైళ్లను నడుపుతోంది. దీనిలో భాగంగా బెంగళూరు నుంచి న్యూదిల్లీ వరకు సికింద్రాబాద్‌ మీదుగా వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఇవాళ పట్టాలెక్కింది. బెంగళూరు రైల్వే స్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రైలు చేరుకున్న అనంతరం 288 మంది ప్రయాణికులు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించిన అనంతరం వారిని స్టేషన్‌ లోపలికి అనుమతించారు. పటిష్ఠ బందోబస్తు మధ్య రైళ్లను నడుపుతున్నారు. రైళ్లలో కూడా భౌతికదూరం పాటిస్తూ కూర్చునేలా చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని