పిల్లల్లో భిన్నంగా కరోనా లక్షణాలు 

కరోనా వైరస్‌ బారిన పడితే పెద్దవారిలో మొదటి దగ్గు, తుమ్ము, జలుబు వంటి లక్షణాలు బయట పడుతున్నాయి.. కానీ పిల్లల్లో ఈ లక్షణాలు భిన్నంగా ఉంటున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. చిన్నారుల్లో వారి పేగులపై వైరస్‌ తొలుత దాడి చేస్తుడడంతో విరేచనాలు, జ్వరం వంటివి...

Published : 14 May 2020 01:07 IST

విరేచనాలు, జ్వరం వంటివి ఉన్నా అనుమానించాల్సిందే.. 


హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ బారిన పడితే పెద్దవారిలో మొదటి దగ్గు, తుమ్ము, జలుబు వంటి లక్షణాలు బయట పడుతున్నాయి.. కానీ పిల్లల్లో ఈ లక్షణాలు భిన్నంగా ఉంటున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. చిన్నారుల్లో వారి పేగులపై వైరస్‌ తొలుత దాడి చేస్తుండటంతో విరేచనాలు, జ్వరం వంటివి వెలుగు చూస్తున్నాయని పేర్కొంది. ఎలాంటి శ్వాస సంబంధిత ఇబ్బందులు లేకున్నా విరేచనాలు, జ్వరం వంటివి ఉంటే వారిని అనుమానించాల్సిందేనని సూచించింది. ఫ్రాంటీయర్స్‌ జనరల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం కరోనా వైరస్‌ బారిన పడిన తొలినాళ్లలో గ్యాస్ట్రో ఇంటెస్టనల్‌ లక్షణాలతో చిన్నారులు సతమతమవుతున్నారు. వారి జీర్ణకోశ వ్యవస్థపై కరోనా దాడి చేస్తుంది. వైరస్‌ రిసెప్టర్లు దాడి చేసే ఊపిరితిత్తుల్లోని కణాలే పేగుల్లోనూ ఉంటాయని పరిశోధకులు తెలిపారు. శ్వాస సంబంధిత లక్షణాలు లేకున్నా పిల్లలు నిమోనియా, కరోనా వైరస్ బారిన పడినట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని