
న్యాయవాదులకు నూతన డ్రెస్‌కోడ్
సిబ్బందిని కోరిన ప్రధాన న్యాయమూర్తి బాబ్డే
దిల్లీ: న్యాయమూర్తులు, న్యాయవాదులను చూడగానే నలుపు రంగు కోట్లు గుర్తుకు వస్తాయి. అయితే వారు ఇప్పుడు వాటికి గుడ్‌బై చెప్పనున్నారు. దానికి కూడా కరోనా మహమ్మారే కారణం. ఈ నేపథ్యంలో కొత్త డ్రెస్ కోడ్‌ను త్వరలో వెల్లడిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే బుధవారం ప్రకటించారు. అప్పటి వరకు నల్లని దుస్తులు ధరించవద్దని న్యాయ సిబ్బందికి సూచించారు. ‘ప్రస్తుతానికి నల్ల కోట్లు, గౌన్లు ధరించడం మానుకోండి. వాటికి కరోనా వైరస్ సులభంగా అంటుకుంటుంది’ అని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా బాబ్డే వ్యాఖ్యానించారు.
వైరస్ వ్యాప్తి కారణంగా చాలా రోజులుగా న్యాయమూర్తులు ఇంట్లోనే ఉండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు విచారిస్తున్నారు. అయితే నిన్నటి నుంచే కోర్టు గదుల్లో కేసుల విచారణ ప్రారంభమైంది. కానీ ప్రతివాదులు ఇప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణలో పాల్గొంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.