ఏపీ సీఎంఆర్‌ఎఫ్‌కు కొనసాగుతోన్న విరాళాలు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పలు సంస్థలు బాసటగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల రూపంలో పలువురు దాతలు తమవంతు సాయాన్ని చేస్తున్నారు. ప్రముఖ బంగారం విక్రయ సంస్థ లలిత

Published : 13 May 2020 19:08 IST

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పలు సంస్థలు బాసటగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల రూపంలో పలువురు దాతలు తమవంతు సాయాన్ని చేస్తున్నారు. ప్రముఖ బంగారం విక్రయ సంస్థ లలిత జ్యువెలరీస్‌ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎం సహాయనిధికి రూ. 1 కోటి విరాళం అందించింది. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ఆ సంస్థ సీఎండీ ఎం. కిరణ్ కుమార్ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. అమెరికాలోని ప్రవాసాంధ్రులు సైతం సీఎం సహాయనిధికి విరాళాలు అందించారు. అమెరికాలోని ప్రవాసాంధ్రులు డా. జి. శ్రీనివాస్ రెడ్డి, డా. లలిత, రమణా రెడ్డి, మనోహరి కలిసి రూ. 50లక్షల విరాళం అందించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు వైకాపా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డితో కలిసి సీఎంకు చెక్కును అందించారు. ఇండియన్ బ్యాంక్ రూ. 30 లక్షల విరాళం అందించింది. ఇండియన్ బ్యాంక్ డీజీఎం ప్రసాద్ విరాళానికి సంబంధించిన డిమాండ్‌ డ్రాఫ్ట్‌ను సీఎంకు అందించారు. సీఎంను కలిసిన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ మేజేజర్‌ రూ.17 లక్షల విరాళం చెక్కును సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని