ఏపీలో భూముల విక్రయానికి రంగం సిద్ధం

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల భూముల విక్రయానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు అభివృద్ధి చేసిన భూముల విక్రయానికి బిల్డ్ ఏపీ మిషన్‌ కార్యాచరణ రూపొందించింది. వేలం ద్వారా ఈ భూములు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి

Published : 13 May 2020 20:35 IST

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల భూముల విక్రయానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు అభివృద్ధి చేసిన భూముల విక్రయానికి బిల్డ్ ఏపీ మిషన్‌ కార్యాచరణ రూపొందించింది. వేలం ద్వారా ఈ భూములు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో విశాఖ, గుంటూరులో తొమ్మిది చోట్ల భూముల విక్రయించనున్నారు. ఈ నెల 29న విశాఖలో 6, గుంటూరులో 3 ప్రాంతాల్లో భూములకు బిల్డ్‌ ఏపీ మిషన్‌ ఈ-వేలం నిర్వహించనుంది. వేలం ద్వారా వచ్చే సమకూరే ఆదాయాన్ని నవరత్నాలు, నాడు- నేడు వంటి ప్రభుత్వ పథకాలకు వెచ్చించనున్నారు. భూముల వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని బిల్డ్‌ ఏపీ మిషన్‌ ప్రకటించింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని