చివరి దశలో దుర్గం చెరువు నిర్మాణ పనులు

దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా నిర్మితమవుతున్న దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావడానికి వచ్చాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న 754.38 మీటర్ల పొడవు గల వంతెన త్వరలోనే అందుబాటులోకి రానుంది......

Published : 14 May 2020 14:17 IST

హైదరాబాద్‌ : దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా నిర్మితమవుతున్న దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న 754.38 మీటర్ల పొడవు గల వంతెన త్వరలోనే అందుబాటులోకి రానుంది. తాజాగా విడుదల చేసిన ఏరియల్‌ వ్యూ నగర ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. రంగురంగుల విద్యుత్‌ కాంతులతో హైదరాబాద్‌ మొట్టమొదటి హ్యాంగింగ్‌ బ్రిడ్జిగా పేరొందడంతోపాటు పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది. ఈ వంతెన నిర్మాణంతో హైటెక్‌ సిటీ ఫినాన్షియల్‌ డిస్టిక్ట్‌కు ఇది ప్రత్యేక ఐకానిక్‌గా ఉంటుంది. రోడ్‌ నంబర్‌ 36, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లపై వాహనాల ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని