ఏడాదికి 15 రోజులు ఇంటి నుంచే..

ప్రభుత్వ అధికారులు ఏడాదికి 15 రోజులు ఇంటి నుంచి పనిచేసేలా డీవోపీటీ ముసాయిదాను సిద్ధం చేసిందని సమాచారం. లాక్‌డౌన్‌ కాలంలో వచ్చిన మార్పులను కొనసాగించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని తెలిసింది. కరోనా వైరస్‌ ముప్పుతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే....

Published : 14 May 2020 16:21 IST

లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని

ముంబయి: ప్రభుత్వ అధికారులు ఏడాదికి 15 రోజులు ఇంటి నుంచి పనిచేసేలా డీవోపీటీ ముసాయిదాను సిద్ధం చేసిందని సమాచారం. లాక్‌డౌన్‌ కాలంలో వచ్చిన మార్పులను కొనసాగించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని తెలిసింది. కరోనా వైరస్‌ ముప్పుతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో పనులు ఆగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇంటి నుంచి పనిచేసే సౌకర్యాన్ని ఉద్యోగులకు కల్పించింది. ఇకపైనా దానిని పరిమితుల మేరకు కొనసాగించాలని భావిస్తోంది.

‘కేంద్ర సచివాలయంలో భౌతికదూరం నిబంధనలు అమలు చేసేందుకు ఇక ముందు హాజరు, పని గంటల్లో మార్పులు చేయాలి’ అని ముసాయిదాలో ప్రతిపాదించారని తెలిసింది. అన్ని మంత్రిత్వ శాఖల్లో ఇ-కార్యాలయం (e-office)ను అమలు చేయాలని డీఓపీటీ ప్రతిపాదించింది. ఇప్పటికే 75 మంత్రిత్వ శాఖలు డిజిటల్‌ వేదికల్లో పనిచేయడం ఆరంభించాయి. దాదాపు 57 శాఖలు 80% పనిని ఇ-కార్యాలయంలోనే చేస్తుండటం గమనార్హం.

ఈ విధానాన్ని ఇకపై కొనసాగించేందుకు సెక్షన్‌ అధికారి స్థాయి వ్యక్తులకు వీపీఎన్‌ యాక్సెస్‌ ఇవ్వాలని డీఓపీటీ ప్రతిపాదించింది. ప్రస్తుతానికి ఈ అధికారం డిప్యూటీ సెక్రటరీ, ఆపై స్థాయి అధికారులకు మాత్రమే ఉంది. భద్రతా పరమైన ఇబ్బందులను తొలగించేందుకు వర్గీకరించిన దస్త్రాలను ఇంటర్నెట్‌ నుంచి యాక్సెస్‌ చేయకుండా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ దస్త్రాలు చూసే వారికి ఇంటి నుంచి పని సౌకర్యం ఉండదని డీఓపీటీ వెల్లడించింది.

ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లను ఇవ్వనుందని తెలిసింది. ఎవరైతే ఇంటి నుంచి పని సౌకర్యం ఉపయోగించుకుంటారో వారికి వీటిని అందిస్తారు. పార్లమెంటు సంబంధిత, వీఐపీ ప్రశ్నల దస్త్రాలను ప్రాసెస్‌ చేసేవారికి ఎస్‌ఎంఎస్‌ వ్యవస్థను తీసుకురావాలని డీఓపీటీ ప్రతిపాదించింది. సమావేశాల కోసం ఎన్‌ఐసీ వేదికలను వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం ఉపయోగించుకోవాలని సూచించింది. ‘ఇంటి నుంచి పనిచేసే అధికారులు ఫోన్లో అందుబాటులో ఉంటారు. వారి కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను మాల్‌వేర్ల నుంచి రక్షించే బాధ్యత ఎన్‌ఐసీ తీసుకుంటుంది’ అని ముసాయిదాలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి

లాక్‌డౌన్‌ 4.0: బయట భద్రమేనా?

కరోనా ఎప్పటికీ తగ్గదేమోనని WHO ఆందోళన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని