పిల్లుల నుంచి ఇతర జంతువులకు వైరస్‌ వ్యాప్తి 

కరోనా వైరస్‌ వ్యాధి సోకిన పిల్లుల నుంచి ఇతర జంతువులకు కొవిడ్‌ వ్యాపిస్తుందని అమెరికాలోని విస్కన్షన్‌ మ్యాడిసన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది. కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న మూడు పిల్లులను పరిశోధన కేంద్రంలో ఉంచి అధ్యయనం చేశారు. పిల్లుల ముక్కు నుంచి సేకరించిన నమూనాలను.......

Published : 15 May 2020 01:55 IST

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాధి సోకిన పిల్లుల నుంచి ఇతర జంతువులకు కొవిడ్‌ వ్యాపిస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది. కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న మూడు పిల్లులను పరిశోధన కేంద్రంలో ఉంచి అధ్యయనం చేశారు. పిల్లుల ముక్కు నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించి వాటిలో కరోనా ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో వాటికి సన్నిహితంగా మెలిగిన మిగతా పిల్లుల్లో ఎలాంటి వైరస్‌ లక్షణాలు కనిపించలేదని న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అనే పత్రిక ఆ పరిశోధనకు సంబంధించిన వివరాలను ప్రచురించింది. మూడు రోజుల తరువాత తిరిగి పరీక్షించగా వైరస్‌ సోకిన జంతువుల నుంచి మిగితా అన్ని జంతువులకు కొవిడ్‌ వ్యాపించినట్లు తేలింది. కానీ పిల్లుల నుంచి మనుషులకు వైరస్‌ వ్యాపిస్తుందనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. జంతువుల నుంచి మనుషుల కంటే మనుషుల నుంచి జంతువులకు వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని