అద్దె చెల్లించలేదని గెంటివేత... 

పాలకొల్లు ఏఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే మంతెన రామలక్ష్మి చిన్న చిన్న పుస్తకాలు అమ్ముకుని జీవిస్తుంటారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆమెకు పూట గడవడమే కష్టంగా మారడంతో

Updated : 15 May 2020 08:51 IST


ఓ దుకాణ అరుగుపై సామాన్లతో వృద్ధురాలు రామలక్ష్మి

పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఏఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే మంతెన రామలక్ష్మి చిన్న చిన్న పుస్తకాలు అమ్ముకుని జీవిస్తుంటారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆమెకు పూట గడవడమే కష్టంగా మారడంతో ఏప్రిల్‌ నెల ఇంటి అద్దె చెల్లించలేకపోయింది. గురువారం ఇంటి యజమానులు బలవంతంగా సామాన్లు బయటపెట్టడంతో ఓ దుకాణ అరుగుపైనే ఇలా తలదాచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని