కరోనా నుంచి కోలుకొని తల్లిదండ్రులయ్యారు

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఈ మహమ్మారి కట్టడిలో భాగంగా  వైద్యులు, పోలీసులు,  పారిశుద్ధ్య  కార్మికులు అందిస్తున్న

Published : 15 May 2020 21:10 IST


 

న్యూదిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడిలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. లాక్‌డౌన్‌ సమయంలో విధులకు హాజరై తన వంతు బాధ్యత నిర్వహించిన ఓ పోలీసు కానిస్టేబుల్‌తో పాటు అతని భార్యకూ కరోనా సోకింది. చికిత్స అనంతరం తిరిగి కోలుకున్న వారికి రెండు మరుపురాని సంఘటనలు జరిగాయి. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేవేందర్‌ అనే వ్యక్తి దిల్లీలోని జహంగీర్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్‌లో విధులకు హాజరైన దేవేందర్‌తోపాటు మరో ఆరుగురు సిబ్బందికీ కరోనా సోకింది. తన కంటే ముందే ఆసుపత్రిలో చేరిన దేవేందర్‌ భార్యకు పరీక్షలు చేసిన వైద్యులు కరోనా పాజిటివ్‌ అని నిర్ధరించారు. అయితే ఆమె గర్భిణీ కావడంతో వారి కుటుంబం ఆందోళనకు గురైంది. మే 8న తన భార్య బిడ్డ పుట్టిందని దేవేందర్‌ తెలిపారు. అనంతరం వారిద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు దేవేందర్‌ నివాసానికి వెళ్లి కరోనా సంక్షోభంలో విధులు నిర్వర్తించిన ఆయనకు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా వారి బిడ్డకు తమ ఆశీర్వాదాలు అందజేశారు. సీనియర్‌ అధికారుల నుంచి తనకు మద్దతు, గౌరవం లభించడం ఎంతో ఆనందంగా ఉందని దేవేందర్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని