శ్రీవారి లడ్డూ కోసం పోటెత్తిన భక్తులు

దాదాపు 55 రోజుల తర్వాత తిరుమల శ్రీవారి మహాప్రసాదాన్ని తితిదే అందుబాటులోకి తెచ్చింది. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వెనుక ఉన్న ...

Updated : 16 May 2020 14:12 IST

తిరుపతి: దాదాపు 55 రోజుల తర్వాత తిరుమల శ్రీవారి మహాప్రసాదాన్ని తితిదే అందుబాటులోకి తెచ్చింది. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వెనుక ఉన్న లడ్డూ  ప్రసాద విక్రయ కేంద్రం ద్వారా ఇవాళ్టి నుంచి  ప్రతి రోజూ 500 శ్రీవారి కల్యాణోత్సవ లడ్డూలు, 500 వడల ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్నారు. దీంతో స్థానికులు స్వామివారి ప్రసాదం  కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. భక్తులు కోరినన్ని లడ్డూలు, వడలను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

కరోనా వైరస్‌, లాక్‌ డౌన్‌ కారణంగా మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనాలను ఆపేసిన తితిదే.. తిరుమలలో లడ్డూ తయారీతో పాటు విక్రయాలను కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని