అంబానీల ముస్తాబు... 

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ కుటుంబానికి చెందిన కొన్ని వైవిధ్య చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.

Published : 16 May 2020 23:11 IST

ముంబయి: అంతర్జాతీయ కుటుంబదినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ కుటుంబానికి చెందిన కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను అనిల్‌ సతీమణి టీనా పోస్టు చేశారు. వీటిల్లో అనిల్‌ అంబానీ తన కుమారులు అన్మోల్‌, అన్షుల్‌లతో కలసి ఉన్నారు. తండ్రికి కేశాలంకరణ, గడ్డం ట్రిమ్‌ చేసుకోవటం వంటి పనుల్లో వారు సహాయపడ్డారు. అంతే కాకుండా.. ‘‘ప్రపంచం క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఈ సమయంలో, మాకు కుటుంబం విలువ గతంలో కంటే ఎక్కువగా తెలిసివచ్చింది. మీకు ప్రియమైన వారిని దగ్గరకు తీసుకోండి.. ప్రత్యక్షంగా కాకపోతే ఆన్‌లైన్లోనైనా వారితో కలసి సమయం గడపండి.. వారితోనే మీ స్వర్గం... వారే మీ సొంత ప్రపంచం!’’ అని టీనా అంబానీ ఈ సందర్భంగా తెలియజేశారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని