‘రైతాంగానికి బాసటగా నిలవాల్సిన సమయమిది’

కరోనా మహమ్మారి కట్టడి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలతో అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి...

Published : 16 May 2020 15:35 IST

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కట్టడి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలతో అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. టీఎస్‌ ఆగ్రోస్‌ సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చిన గేటెడ్‌ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాలకు సేంద్రియ మామిడి పండ్లు అందిస్తున్న www.cropmandi.com వెబ్‌ పోర్టల్‌ను మంత్రుల నివాస ప్రాంగణంలో శనివారం నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. కొవిడ్‌-19 సంక్షోభ సమయంలో రైతులు పండించిన ఉత్పత్తులు వినియోగదారులకు చేరుస్తున్నందుకు పోర్టల్‌ నిర్వాహకులు లగ్గాని శ్రీనివాస్‌ను మంత్రి అభినందించారు. 

అనంతరం మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచానికి అన్నం పెట్టే రైతాంగానికి అందరూ బాసటగా నిలవాల్సిన సమయమిదని అభిప్రాయపడ్డారు. మామిడి, బత్తాయి, పుచ్చకాయ, సపోట తదితర పంటలను వినియోగదారుల ఇంటి ముందుకే తీసుకొచ్చేందుకు ప్రభుత్వ సంస్థలతోపాటు వాటి సహకారంతో అనేక ఇతర సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ విధంగా అందరూ ముందుకొచ్చి రైతులకు తోడ్పాటు ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని మంత్రి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని