తుపానుగా మారనున్న వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఈ ఉదయం అదేప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఇది పారదీప్(ఒడిశా)కు దక్షిణ దిశగా 1100 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ...

Updated : 16 May 2020 16:36 IST

హైదరాబాద్‌: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఈ ఉదయం అదేప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఇది పారదీప్(ఒడిశా)కు దక్షిణ దిశగా 1100 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ సాయంత్రానికి ఇది తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తదుపరి 24 గంటల్లో తీవ్రతుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇది క్రమంగా ఉత్తరవాయువ్య దిశగా ప్రయాణించి.. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఈ నెల 18 నుంచి 20 తేదీల్లో పశ్చిమ బెంగాల్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ కారణంగా ఈ నెల 18 నుంచి ఒడిశాలోని తీరప్రాంతాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఒడిశా, బెంగాల్‌ తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. రేపటి నుంచి గాలుల ఉద్ధృతి పెరగనుందని చెప్పింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు