- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
హాంకాంగ్ కుక్కలకు యజమానుల ద్వారానే వైరస్
హాంకాంగ్‌లో కరోనా సోకిన రెండు కుక్కలకు వాటి యజమానుల ద్వారానే వైరస్ వ్యాపించిందని పరిశోధకులు గుర్తించారు. ఆ కుక్కలు, వాటి యజమానుల్లోని వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ కుక్కల నుంచి ఇతర కుక్కలకు లేదంటే మనుషులకు వైరస్ వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని వీరు వెల్లడించారు. కొవిడ్-19 బాధితుల నుంచి కుక్కలకు ఈ వైరస్ వ్యాపిస్తుందని స్పష్టమైనప్పటికీ అందుకుగల అవకాశాలు చాలా తక్కువని వీరు స్పష్టంచేస్తున్నారు. వ్యాధి బాధితులతో కలిసి ఉన్న 15 కుక్కల్లో కేవలం రెండింటికి మాత్రమే ఈ వైరస్ సోకిందని నెదర్లాండ్స్ వైద్యులు తమ అధ్యయనంలో గుర్తించారు. భవిష్యత్తులో తలెత్తే ముప్పులను నివారించాలంటే.. పెంపుడు జంతువుల మధ్య వైరస్ వ్యాప్తిపై కూలంకషంగా అధ్యయనం చేయాలని మరికొందరు పరిశోధకులు స్పష్టంచేస్తున్నారు. హాంకాంగ్‌లో ఈ రెండు కుక్కలతో పాటు, ఓ పిల్లి, న్యూయార్క్‌లో రెండు పిల్లులు, జంతు ప్రదర్శనశాలలోని 4 పులులు, 3 సింహాలు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అలానే పిల్లులపై నిర్వహించిన సర్వేలో.. ఇవి లక్షణాలు లేకుండా ఇతర పిల్లులకు ఈ వ్యాధిని వ్యాప్తి చేయగలవని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వ్యాధి బాధితులు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vijay Deverakonda: ఆ విషయంలో నాకు ఏడుపొస్తుంది: విజయ్ దేవరకొండ
-
General News
Andhra News: స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. 175 మంది ఖైదీల విడుదల
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Khammam: కార్యకర్తలు సంయమనం పాటించాలి.. కృష్ణయ్య హత్య ఘటనపై తుమ్మల దిగ్ర్భాంతి
-
Sports News
MS Dhoni : ధోనీ వీడ్కోలు పలికి అప్పుడే రెండేళ్లు.. మరోసారి వైరల్‌గా మారిన రిటైర్మెంట్ ‘టైమ్’
-
Viral-videos News
Viral Video: ఇద్దరు వైద్యుల డ్యాన్స్.. ఇప్పుడు నెట్టింట హల్చల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Flag Hoisting: కరుణానిధి చొరవతో సీఎంల జెండావందనం!
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ