లాక్‌డౌన్‌పై పోలీసుల సందేశాత్మక వీడియో

లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆంక్షల దృష్ట్యా వాహనదారులు రోడ్లపైకి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎక్కడికక్కడ జరిమానాలు విధిస్తున్నారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా.....

Updated : 17 May 2020 19:02 IST

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆంక్షల దృష్ట్యా వాహనదారులు రోడ్లపైకి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎక్కడికక్కడ జరిమానాలు విధిస్తున్నారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా జరిమానాలు విధించారు. 80 వేలకుపైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు క్షేత్రస్థాయిలో విధులను ప్రతిబింబించేలా రూపొందించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌ కుమార్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులతో సందేశాత్మక దృశ్యాలను చిత్రీకరించి వీడియో రూపొందించారు. ప్రస్తుతం ఈ సందేశాత్మక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు