సంక్షేమం, భవిష్యత్తుపై దృష్టితోనే అభివృద్ధి 

కరోనా విపత్కర పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల భారీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించగా.. ఐదు రోజులుగా వివిధ రంగాలకు కేటాయింపులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఐదో రోజు సంక్షేమం, స్వావలంభన, సంస్కరణలపై మాట్లాడారు.

Published : 17 May 2020 22:12 IST

ముఖాముఖిలో సీఐఐ ఏపీ విభాగం ఛైర్మన్‌ రామకృష్ణ

విజయవాడ: కరోనా విపత్కర పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల భారీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించగా.. ఐదు రోజులుగా వివిధ రంగాలకు కేటాయింపులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఐదో రోజు సంక్షేమం, స్వావలంబన, సంస్కరణలపై మాట్లాడారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు, వాటికి సంబంధించిన అంశాలపై సీఐఐ ఏపీ విభాగం ఛైర్మన్‌ రామకృష్ణతో ప్రత్యేక ముఖాముఖి..

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీతో ఏయే రంగాలకు, ఏ మేర ఊతం లభించనుంది..?

కరోనా కారణంగా ఆదాయం లేక.. భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ప్రజలు బెంగ పడుతున్న తరుణంలో కేంద్రం రూ.20 లక్షల ప్యాకేజీ ప్రకటించడం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఇందులో దాదాపు రూ.3.6 లక్షల కోట్లు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అప్పు రూపంలో కేటాయిస్తామన్నారు. అయితే కరోనా కారణంగా కొన్ని రంగాలు పూర్తిగా దెబ్బతినగా.. మరికొన్ని లాక్‌డౌన్‌ అనంతరం వెంటనే పుంజుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫార్మా రంగానికి అనుకున్న దానికంటే ఎక్కువ డిమాండ్‌ వచ్చింది. ప్రస్తుత కేటాయింపులతో డిమాండ్‌ పెరిగిన, వెంటనే కోలుకునే రంగాలకు మేలు జరుగుతుంది. కానీ.. పూర్తిగా దెబ్బతిన్న రంగాలను గుర్తించి వాటికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆ రంగాల వృద్ధి కోసం ఆదాయం ఎలా తెచ్చుకోవాలనే విషయంపై దృష్టి పెట్టాలి. 

ప్యాకేజీ నుంచి అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు..? దీనివల్ల రాష్ట్రాలకు ఎలాంటి మేలు జరగనుంది..?

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకోవడం సహజం. ప్రాథమిక అవసరాలను తీర్చుకునేందుకు తీసుకోవాలి కూడా.  అయితే వాటిని ఎలా ఖర్చు చేస్తున్నామనేది రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా ముఖ్యం. ఇటు మౌలిక వసతుల కల్పన, అదే సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం కొంత పక్కన ఉంచుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల తిరిగి ఉద్యోగాలు, పనులు పెరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్‌ సంస్థలు ఇదే సూత్రాన్ని పాటించాలి. సంక్షేమం, భవిష్యత్తుపై దృష్టి పెట్టినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది.

మరిన్ని వివరాలు కింది వీడియోలో చూడండి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని