
క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిందే: రైల్వేశాఖ
దిల్లీ: ప్రత్యేక రైళ్లలో ఆయా రాష్ట్రాలకు చేరుకుంటున్న ప్రయాణికులు అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న క్వారంటైన్ నిబంధనలు పాటించి తీరాల్సిందేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో ఓ ప్రమాణ పత్రాన్ని పాప్ అప్‌గా కూడా ఉంచింది. ఆయా రాష్ట్రాల క్వారంటైన్ నిబంధనల్ని అనుసరిస్తామంటూ ప్రమాణ పత్రం ఐకాన్‌ను టిక్ చేశాకే టికెట్ బుక్ చేసుకునేలా ఏర్పాటు చేసింది. ఈ పాప్ అప్‌లో ప్రమాణ పత్రం ఐకాన్ పక్కన హిందీ, ఇంగ్లిష్ భాషల్లో క్వారంటైన్ నిబంధనలు పాటిస్తామని ఉంటుంది. ఇటీవల దిల్లీ నుంచి ప్రత్యేక రైలులో బెంగళూరుకు వచ్చిన 50 మంది ప్రయాణికులు క్వారంటైన్‌కు వెళ్లేందుకు నిరాకరించిన నేపథ్యంలో రైల్వేశాఖ ఈ ప్రమాణ పత్రాన్ని ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో ఉంచింది. బెంగళూరులో క్వారంటైన్‌ను నిరాకరించిన వారిలో 15 మందిని దిల్లీ వెళ్లే రైలుకు ప్రత్యేక బోగీని అమర్చి, డబ్బులు కూడా వారి నుంచే వసూలు చేసి తిప్పి పంపించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.