రాష్ట్రపతి భవన్ పోలీస్ అధికారికి కరోనా
రాష్ట్రపతి భవన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు ఉన్నతాధికారికి కరోనా సోకినట్లు అక్కడి అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రపతి భవన్‌లోని పలువురు భద్రతా సిబ్బందిని కార్వంటైన్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.....
దిల్లీ: రాష్ట్రపతి భవన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు ఉన్నతాధికారికి కరోనా సోకినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రపతి భవన్‌లోని పలువురు భద్రతా సిబ్బందిని కార్వంటైన్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతి గృహ సముదాయానికి సమీప ప్రాంతంలోనే సదరు అధికారి కార్యాలయం ఉండటంతో ఆ ప్రాంతం మొత్తం శానిటైజేషన్ చేసినట్లు తెలిపారు. దిల్లీ పోలీస్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారికి రాష్ట్రపతి భవన్లో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 13న ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఆయనలో కరోనా లక్షణాలు లేనప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన్ను ఐసోలేషన్‌కు తరలించారు. ఆదివారం పరీక్షల ఫలితాల్లో పాజిటివ్ అని నిర్థారణ కావడంతో ఆయనతో కలిసి పనిచేసిన భద్రతా సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్‌కి తరలించినట్లు రాష్ట్రపతి భవన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత నెలలో కూడా రాష్ట్రపతి సెక్రటేరియట్లో భవనంలో పనిచేసే ఓ ఉద్యోగి బంధువు కరోనా రోగితో సన్నిహితంగా మెలగడంతో అక్కడ పనిచేసే 115 కుంటుంబాల వారిని క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు