
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి మరోసారి రేపు సమావేశం కానుంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ ఈ భేటీ జరగనుంది. లాక్డౌన్ 4.0కు సంబంధించి కేంద్రం తాజాగా వెలువరించిన మార్గదర్శకాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగనుంది. లాక్డౌన్ విషయంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధివిధానాలపైనా చర్చించే అవకాశం ఉంది. దీనికి తోడు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటికే మే 29 వరకు లాక్డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.