Published : 18/05/2020 13:32 IST

మాస్క్‌ లేకుంటే ప్రయాణం మొదలవ్వదు

మార్గదర్శకాలు విడుదల చేసిన ఉబెర్‌ 

ముంబయి: కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో భారత్‌లోని ప్రయాణికులు, డ్రైవర్లకు ఉబెర్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది. తిరిగి నోటీసులు ఇచ్చేంతవరకు ‘ఉబెర్‌ పూల్‌’ (ఫేరింగ్‌)ను రద్దు చేస్తున్నామని వెల్లడించింది. కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతించింది.

ముందు సీట్లో ప్రయాణికుడికి అనుమతి లేదని ఉబెర్‌ తెలిపింది. డ్రైవర్‌ మాస్క్ ధరించకపోతే ఏ క్షణంలోనైనా ప్రయాణాన్ని రద్దు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక ఎయిర్‌ కండిషన్‌ను ‘ఫ్రెష్‌ ఎయిర్‌మోడ్‌’లో మాత్రమే ఉపయోగించాలని వెల్లడించింది. బ్యాగుల నిర్వహణను ప్రయాణికుడే చూసుకోవాలని పేర్కొంది.

ప్రయాణం ఆరంభానికి ముందు ఉబెర్‌ మూడు అంచెల తనిఖీ విధానం ప్రవేశపెట్టింది. ఇందుకోసం డ్రైవర్‌ తన మొబైల్లో కచ్చితంగా ‘కొవిడ్‌ హబ్’ యాప్‌ వేసుకోవాలి. మాస్క్‌ ఎలా ధరించాలో, కార్డును ఎలా డిసిన్‌ఫెక్ట్‌ చేసుకోవాలో శిక్షణనిస్తామని కంపెనీ తెలిపింది. లాగిన్‌ అయిన ప్రతిసారీ డ్రైవర్‌ ముఖానికి తప్పనిసరిగా మాస్క్‌ ఉండాలి. మాస్క్‌ వేసుకున్న తర్వాత చిత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలి. ఇవన్నీ చేయకపోతే ప్రయాణం ఆరంభమవ్వదు.

మాస్క్‌ లేకుండా డ్రైవర్‌ తన చిత్రాన్ని అప్‌లోడ్‌ చేస్తే ప్రయాణం ఆరంభం కాదని ఉబెర్‌ తెలిపింది. ఒకవేళ డ్రైవర్‌ మాస్క్‌ ధరించకపోతే ప్రయాణికుడు ఏ క్షణంలోనైనా ప్రయాణాన్ని రద్దు చేసుకోవచ్చని వెల్లడించింది. ప్రతి ప్రయాణానికి ముందు కారును శానిటైజ్‌ చేయాలని డ్రైవర్‌కు సూచించింది. ఎక్కువ స్పర్శించే సీటు, డోర్‌ హ్యాండిల్‌, అడ్జస్టర్‌ వంటివాటిని తప్పక శుభ్రం చేయాలని స్పష్టం చేసింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని