31 వరకు భక్తులకు అనుమతి లేదు: వెల్లంపల్లి

లాక్‌డౌన్‌ అమలు నేపథ్యంలో ఈ నెల 31 వరకు ఆలయాల్లో భక్తులకు అనుమతివ్వడం లేదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు గత ఆదేశాలను కొనసాగించాలని

Published : 18 May 2020 15:14 IST

అమరావతి: లాక్‌డౌన్‌ అమలు నేపథ్యంలో ఈ నెల 31 వరకు ఆలయాల్లో భక్తులకు అనుమతివ్వడం లేదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు గత ఆదేశాలను కొనసాగించాలని దేవాదాయ శాఖకు మంత్రి ఆదేశాలుజారీ చేశారు. అయితే, అన్ని దేవాలయాల్లో నిత్య పూజలు మాత్రం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఆర్జిత సేవల కోసం ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు జరిపేందుకు భక్తులకు అనుమతిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  ఈ మేరకు సేవలు అందించేందుకు అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని