వైద్యుడు సుధాకర్‌ అరెస్ట్‌పై వ్యాజ్యం

విశాఖలో డాక్టర్ సుధాకర్ అరెస్ట్‌పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. వైద్యుడి హక్కులకు భంగం కలిగించేలా అర్ధ నగ్నంగా నడి రోడ్డుమీద ఆయనను అరెస్ట్‌ చేశారని వెంకటేశ్వర్లు

Published : 18 May 2020 19:39 IST

అమరావతి: విశాఖలో డాక్టర్ సుధాకర్ అరెస్ట్‌పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. వైద్యుడి హక్కులకు భంగం కలిగించేలా అర్ధ నగ్నంగా నడి రోడ్డుమీద ఆయనను అరెస్ట్‌ చేశారని వెంకటేశ్వర్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసు అధికారులు వ్యవహరించారన్నారు. దాడికి పాల్పడిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని