అసలు ఇది ప్యాకేజీనా?: కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాకేజీ వట్టి డొల్ల అని విమర్శించారు. మేమొకటి కోరితే.. కేంద్రం ఒకటి ఇచ్చిందని మండిపడ్డారు. కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు. విపత్తు వేళ రాష్ట్రాలు ఒకటి కోరితే కేంద్రం ఇచ్చింది వేరని కేసీఆర్‌ అన్నారు.

Updated : 09 Aug 2022 11:58 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాకేజీ వట్టి డొల్ల అని విమర్శించారు. మేమొకటి కోరితే.. కేంద్రం ఒకటి ఇచ్చిందని మండిపడ్డారు. కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు. విపత్తు వేళ రాష్ట్రాలు ఒకటి కోరితే కేంద్రం ఇచ్చింది వేరని కేసీఆర్‌ అన్నారు.

‘‘కేంద్ర ప్యాకేజీ అంకె గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంచాలని మేం అడిగితే సంస్కరణలు అమలు చేస్తే ఇస్తామని కేంద్రం అంటోంది. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తారా? మున్సిపాలిటీల్లో ఛార్జీలు పెంచితే రుణ పరిమితి పెంచుతారా? దీన్ని అసలు ప్యాకేజీ అంటారా? ఇది పచ్చిమోసం. కేంద్రం దాని పరువు అదే తీసుకుంది. విపత్తు వేళ కేంద్రం వ్యవహరించిన తీరు సరికాదు. మెడ మీద కత్తి పెట్టి ఇది చెయ్యి.. అది చెయ్యి అని చెప్పడం ప్యాకేజీనా? ఆ నిబంధనలు అమలు చేస్తేనే రుణాలు ఇస్తామంటే అవి మాకు అక్కర్లేదు’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని