ఎన్జీటీకి విచారణాధికారం లేదు: ఎల్జీ పాలిమర్స్‌

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)‌, రాష్ట్ర హైకోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం, జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం సహా మొత్తం ఏడు కమిటీలు వేశాయని ఎల్జీ పాలిమర్స్‌

Published : 19 May 2020 14:31 IST

దిల్లీ: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)‌, రాష్ట్ర హైకోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం, జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం సహా మొత్తం ఏడు కమిటీలు వేశాయని ఎల్జీ పాలిమర్స్‌ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మే 7న ఘటన జరిగితే... 8న విచారణ కమిటీలు వేశాయని వివరించారు. హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.50 కోట్లు జమ చేసినట్లు వివరించారు. ఎన్జీటీకి సుమోటోగా విచారణకు ఆదేశించే అధికారం లేదని ఎల్జీపాలిమర్స్‌ న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... అవన్నీ అక్కడే తేల్చుకోవాలని సూచించింది. విచారణాధికారంపై ఎన్జీటీలో లేవనెత్తే అవకాశం కల్పించింది. జూన్‌ 1న హరిత ట్రైబ్యునల్‌లో విచారణ తరువాత వాదనలు వింటామని జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ జూన్‌ 8కి వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని