గడ్డ కట్టిన నీటిలోకి అమాంతం దూకేసి...

చలికాలంలో మామూలుగా ఉన్న నీటిలోకి దూకాలంటేనే వణికిపోతాం. అలాంటిది ఒక వ్యక్తి మంచుథాటికి గడ్డకట్టుకుపోయిన నీటిలో ఒక కంతలోకి దూకి నీరు గడ్డకట్టిన కిందిభాగాన ఈత

Updated : 08 Dec 2022 18:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చలికాలంలో మామూలుగా ఉన్న నీటిలోకి దూకాలంటేనే వణికిపోతాం. అలాంటిది ఒక వ్యక్తి మంచుతో గడ్డకట్టుకుపోయిన నీటిలో ఒక కంతలోకి దూకి నీరు గడ్డకట్టిన కిందిభాగాన ఈత కొడుతూ మరో కంతలోనుంచి బయటకు వస్తున్నాడు. నార్వేకు చెందిన అర్నే హౌలెండ్‌ అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా చేయాలనే ఎప్పుడూ అనుకుంటుఉంటాడు. అందుకు అనుగుణంగా ఇటువంటి ఫీట్లు చేస్తూ ఉంటాడు. దీనిపై అర్నే స్పందస్తూ ఇలా దూకడం తనకు కొత్తేమి కాదని వారానికొకసారి ఇలాంటి అడ్వెంచర్స్‌ చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను సామాజికమాధ్యమాలలో ఉంచగా నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అద్భుతం అంటూ కొందరు, ఒళ్లు గగుర్పొడుస్తుందంటూ కొందరూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోలు మీరు చూసేయండి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని