భక్తులకు తితిదే తీపి కబురు

కలియుగ ప్రత్యక్ష్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని గత 60 రోజులుగా కల్పించలేకపోవడం బధాకరమని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. దర్శనాలు ఎప్పుడు పునఃప్రారంభిస్తామో ఇప్పట్లో

Published : 21 May 2020 03:15 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని గత 60 రోజులుగా కల్పించలేకపోవడం బాధాకరమని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. దర్శనాలు ఎప్పుడు పునఃప్రారంభిస్తామో ఇప్పట్లో చెప్పలేమన్నారు. అయితే భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలు విక్రయించాలని తితిదే బోర్డు నిర్ణయించిందని చెప్పారు. లడ్డూ ఒకటి రూ.25కే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తితిదే సమాచార కేంద్రాలు, తితిదే కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యేక ఆర్డర్‌పై స్వామివారి లడ్డూలు పంపిణీ చేయనున్నామని.. పెద్దమొత్తంలో లడ్డూ ప్రసాదం కావాలనుకునేవారు ప్రత్యేక ఆర్డర్‌ చేసుకోవచ్చని సూచించారు. ఈ మేరకు పూర్తి వివరాల కోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ - 98495 75952, ఆలయ పేష్కార్‌ శ్రీనివాస్‌ - 97010 92777ను సంప్రదించవచ్చని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని