ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు సర్వీసులు రేపు ఉదయం నుంచి నడవనున్న నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్లను ప్రారంభించింది. రిజర్వేషన్‌ చేసుకున్నవారినే బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తామని..

Updated : 20 May 2020 22:48 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు సర్వీసులు రేపు ఉదయం నుంచి నడవనున్న నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్లను ప్రారంభించింది. రిజర్వేషన్‌ చేసుకున్నవారినే బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తామని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు నడిచే బస్సుల వివరాలను ఏపీఎస్‌ఆర్టీసీ తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ప్రయాణికులు apsrtconline.in వెబ్‌సైట్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకోవచ్చని సూచించింది. అయితే నిర్ణీత ప్రాంతాల మధ్య కొన్ని సర్వీసులను మాత్రమే నడపనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. విజయవాడ-విశాఖ మధ్య రేపు 1 ఏసీ, 6 సూపర్‌ లగ్జరీ బస్సులను నడపనున్నట్లు తెలిపింది. సూపర్‌ లగ్జరీ బస్సుల్లో కేవలం 18 సీట్లకే రిజర్వేషన్‌ చేసుకునేందుకు అనుమతించినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ వివరించింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని