అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలు ప్రారంభం!

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ తాజాగా ఫుడ్‌ డెలివరీలోకి అడుగుపెట్టింది. మొట్టమొదటగా బెంగళూర్‌లో ప్రారంభించిన సేవలు..ప్రస్తుతం నగరంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

Published : 22 May 2020 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ తాజాగా ఫుడ్‌ డెలివరీలోకి అడుగుపెట్టింది. మొట్టమొదటగా బెంగళూరులో ప్రారంభించిన సేవలు..ప్రస్తుతం నగరంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రాథమికంగా కొన్ని రెస్టారెంట్ల నుంచే వీటిని డెలివరీ చేస్తామని తెలిపింది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఫుడ్‌ డెలివరీ సేవలు విస్తరించే ప్రయాత్నాల్లో అమెజాన్‌ ఉన్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే మార్కెట్లో ఫుడ్‌ డెలివరీ సర్వీసుల్లో దూసుకెళ్తున్న స్విగ్గీ, జొమాటో సంస్థలు కరోనా వైరస్‌ ప్రభావంతో ఉద్యోగులను తొలగిస్తున్న సమయంలోనే అమెజాన్ ఫుడ్‌ డెలివరీ ప్రారంభించడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని