మంచితనం హద్దులు తెలుసుకోవాలనే: స్మృతిఇరానీ

సందర్భానికి తగినట్టు మాట్లాడటంలో, స్పందించటంలో కేంద్రమంత్రి స్మృతిఇరానీ బహునేర్పరి. ఆమెను సామాజికమాధ్యమాలద్వారా అనుసరించేవారికి ఆ విషయం మరింత బాగా తెలుసు. ఆమె షేర్‌ చేసే

Updated : 21 May 2020 20:48 IST

దిల్లీ: సందర్భానికి తగినట్టు మాట్లాడటంలో, స్పందించటంలో కేంద్రమంత్రి స్మృతిఇరానీ బహునేర్పరి. ఆమెను సామాజికమాధ్యమాలద్వారా అనుసరించేవారికి ఆ విషయం మరింత బాగా తెలుసు. ఆమె షేర్‌ చేసే మీమ్స్‌, స్టోరీలు అప్పుడప్పుడూ వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఉంచిన ఒక పోస్టు నెటిజన్లను బాగా ఆకర్షించడంతోపాటు ఆలోచింపజేస్తుంది. అదేమిటంటే ‘‘ జీవితంలో కొన్నిసార్లు మనం చాలా బాధపడతాం, అంతమాత్రంచేత మనమేం చెడ్డపనులు చేసామని కాదు. మంచితనపు హద్దులు తెలుసుకోలేకపోవడం వల్లే’’ అని రాసుకొచ్చారు. ఆ వాక్యాలు చాలామంది జీవితాలకు దగ్గరగా ఉన్నవే. ఇలాంటి జీవితపాఠాలు తెలిపే పోస్టు పెట్టిన ఆమె వెంటనే నవ్వులు పంచేలా ఒక సరదా మీమ్‌ను పోస్ట్‌ చేసింది. అందులో ‘‘ ఆనందం అంటే మన స్నేహితులు కూడా మనలాంటి గందరగోళ ఆలోచనలు కలిగిఉండటమే’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను ఉంచింది. అలాగే కొద్దిరోజుల క్రితం తన తల్లిదండ్రులకు సంబంధించిన వివాహవేడుక ఫోటోను ఉంచి..45 ఏళ్ల క్రితం నిప్పుకణికలైన ఈ ఇద్దరు ఏకమై ప్రపంచానికి నాలాంటి శాంతికపోతాన్ని అందించారు’’ అంటూ సరదాగా రాసుకొచ్చింది. ఆ పోస్టులను మీరు చూసేయండీ..

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని