పెళ్లికి ముందు వివాహేతర సంబంధం... అత్యాచారం కాదు

పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పెట్టి యువతితో వివాహేతర సంబంధం నెరపడం అత్యాచారంగా పరిగణించరాదని ఒడిశా హైకోర్టు అభిప్రాయపడింది.

Updated : 24 May 2020 08:51 IST

ఒడిశా హైకోర్టు

కటక్‌ (ఒడిశా), న్యూస్‌టుడే: పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పెట్టి యువతితో వివాహేతర సంబంధం నెరపడం అత్యాచారంగా పరిగణించరాదని ఒడిశా హైకోర్టు అభిప్రాయపడింది. ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా పొట్టంగి ఠాణాలో నమోదైన కేసు విచారణ సందర్భంగా శనివారం హైకోర్టు జస్టిస్‌ ఎస్‌.కె.పాణిగ్రహి నేతృత్వంలోని ధర్మాసనం ఇలా పేర్కొంది. ‘పెళ్లి చేసుకుంటామని భావించిన కొందరు శారీరకంగానూ కలుస్తున్నారు. యువకుడు పెళ్లికి నిరాకరిస్తే అత్యాచారం జరిగిందని యువతులు ఠాణాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను అత్యాచారాలుగా పరిగణించరాద’ని కోర్టు అభిప్రాయపడింది. 2019లో పొట్టంగి ఠాణా పరిధిలో ఓ యువకుడు తనతో శారీరక  సంబంధం పెట్టుకొని.. తర్వాత పెళ్లికి నిరాకరించాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ పైవిధంగా అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని