ఎల్‌జీ పాలిమర్స్‌పై హైకోర్టు కీలక తీర్పు

విశాఖ జిల్లా ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్‌ చేసి ఉంచాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కంపెనీలోకి ఎవరినీ అనుమతించొద్దని తెలిపింది. అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ

Updated : 24 May 2020 19:13 IST

కంపెనీ ప్రాంగణాన్ని సీజ్‌ చేయాలని ఆదేశాలు

అమరావతి: విశాఖ జిల్లా ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కంపెనీ ప్రాంగణాన్ని సీజ్‌ చేసి ఉంచాలని ఆదేశించింది. కంపెనీలోకి ఎవరినీ అనుమతించొద్దని తెలిపింది. అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాల్లో పేర్కొంది. కంపెనీ డైరెక్టర్లు వారి పాస్‌పోర్టులు స్వాధీనపరచాలని ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనను సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. ఈ మేరకు విచారణకు సంబంధించి ఇవాళ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.

ఎల్‌జీ పాలిమర్స్, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు న్యాయస్థానానికి వారి వాదనలు వినిపించారు. గ్యాస్‌ లీకేజీ జరిగిన తర్వాత స్టైరీన్‌ను ఎవరి అనుమతితో ఇక్కడ నుంచి తరలించారని.. లాక్‌డౌన్‌ తర్వాత ఎవరి అనుమతితో ప్రక్రియ ప్రారంభించారని ప్రశ్నించింది. పూర్తి సమాచారంతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ యాజమాన్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని