80 శాతం రైళ్లు ఆ రెండు రాష్ట్రాలకే: రైల్వే శాఖ

దేశవ్యా్ప్తంగా మే 23వ తేదీ నాటికి 2,813 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా 37 లక్షల మంది ప్రయాణికులను స్వరాష్ట్రాలకు తరలించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వీటిలో 80 శాతం రైళ్లు ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకే వెళ్లినట్లు రైల్వే శాఖ తెలిపింది. 60 శాతం రైళ్లు గుజరాత్‌,

Published : 24 May 2020 19:57 IST

దిల్లీ: దేశవ్యా్ప్తంగా మే 23వ తేదీ నాటికి 2,813 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా 37 లక్షల మంది ప్రయాణికులను స్వరాష్ట్రాలకు తరలించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వీటిలో 80 శాతం రైళ్లు ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకే వెళ్లినట్లు రైల్వే శాఖ తెలిపింది. 60 శాతం రైళ్లు గుజరాత్‌, మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి బయలుదేరగా.. వాటిలో ఎక్కువ భాగం రైళ్లు యూపీ‌, బిహార్‌ వెళ్లినట్లు రైల్వే శాఖ తెలిపింది. మొత్తం శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో 1,301 రైళ్లు ఉత్తరప్రదేశ్‌కు, 973 రైళ్లు బిహార్‌కు వెళ్లాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. 
యూపీ, బిహార్‌ రాష్ట్రాలకు ఎక్కువ రైళ్లు నడుస్తుండటంతో ట్రాఫిక్‌ పెరిగిందని.. దీంతో పలు రైళ్ళ దిశను మార్చి గమ్యస్థానాలకు పంపించినట్లు తెలిపింది. రైల్వే బోర్డు స్థాయి నుంచి డివిజినల్‌ స్థాయి అధికారుల వరకు నిరంతరం రైళ్ల రాకపోకలు, కార్యకలాపాలపై పర్యవేక్షించినట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని