తెలంగాణలో 41 కేసులు.. 50 దాటిన మృతులు

రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ నమోదైన కేసుల్లో ఆరుగురు విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో ఇవాళ మరో 41 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Published : 24 May 2020 20:41 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ నమోదైన కేసుల్లో ఆరుగురు విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో ఇవాళ మరో 41 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 23 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 1, వలస కార్మికులు 11 మంది కరోనా బారినపడ్డారని ఆరోగ్య శాఖ తెలిపింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఆరుగురు కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,854కు చేరింది. ఇవాళ 24 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌ కాగా.. మొత్తంగా 1,092 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ కరోనాతో నలుగురు మృతి చెందగా.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 53కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 709 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని