శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

రెండు నెలల తర్వాత దేశీయ విమాన సేవలు నేటి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు

Updated : 25 May 2020 12:19 IST

హైదరాబాద్‌ : రెండు నెలల తర్వాత దేశీయ విమాన సేవలు నేటి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరి నిమిషంలో విమానాలు ఆలస్యమవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పలు విమాన సర్వీసుల్లో మార్పులు చేశారని నిరసన చేపట్టారు. దీంతో విమానాల కోసం కొన్ని గంటలుగా లాంజ్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. 

వివిధ కారణాలతో పలు మార్గాల్లో విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. శాంషాబాద్‌కు 100కిపైగా విమాన రాకపోకలు సాగించాల్సి ఉందని.. అయితే ఇవాళ 30 విమానాలు మాత్రమే రాకపోకలు సాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని