శ్రీశైలం దేవస్థానంలో మరో అవినీతి

శ్రీశైల దేవస్థానంలో మరో అవినీతి వెలుగు చూసింది. ఆలయ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టికెట్ల విక్రయాల్లో గోల్‌మాల్‌ జరిగినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు రూ.1.40 కోట్లను బ్యాంకుల తరఫున పనిచేసే పొరుగు సేవల సిబ్బంది ఈ అవినీతికి పాల్పడినట్లు దేవస్థానం ఈవో కేఎస్‌ రామారావు పేర్కొన్నారు.

Published : 26 May 2020 01:58 IST

రూ.1.40కోట్లు స్వాహా

 మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం.. విచారణకు ఆదేశం

శ్రీశైలం ఆలయం (కర్నూలు): శ్రీశైల దేవస్థానంలో మరో అవినీతి వెలుగు చూసింది. ఆలయ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టికెట్ల విక్రయాల్లో గోల్‌మాల్‌ జరిగినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు రూ.1.40 కోట్లను బ్యాంకుల తరఫున పనిచేసే పొరుగు సేవల సిబ్బంది ఈ అవినీతికి పాల్పడినట్లు దేవస్థానం ఈవో కేఎస్‌ రామారావు పేర్కొన్నారు. బాధ్యులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. గత జనవరి నెలలోనూ ఇలాంటి ఘటనే శ్రీశైలంలో వెలుగు చూసింది. విరాళ కేంద్రంలో పనిచేసే ముగ్గురు ఒప్పంద ఉద్యోగులు రూ.80 లక్షలను స్వాహా చేశారు.

నగదు రికవరీ చేయండి: మంత్రి
శ్రీశైలం దేవస్థానంలో ఆర్థిక అవకతవకలపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై కర్నూలు ఎస్పీతో మాట్లాడారు. తక్షణమే నగదు రికవరీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారిని నియమించి దర్యాప్తు చేపట్టాలన్నారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే నగదు రికవరీకి చర్యలు చేపట్టాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని