అమ్మ.. బామ్మోయ్‌.. ఎంత ధైర్యం!

సహజంగా ఎవరైనా తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ చిన్న పామును చూసినా గడగడలాడిపోతారు. ఇక బుసలు కొట్టే పెద్ద నాగుపాము కనిపిస్తే అక్కడి నుంచి పరుగులందుకుంటారు...

Published : 26 May 2020 19:23 IST

ఆ బామ్మ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే!

ఇంటర్నెట్‌డెస్క్‌: మన చుట్టుపక్కల చిన్న పామును చూసినా గడగడలాడిపోతాం. ఇక బుసలు కొట్టే పెద్ద నాగుపాము కనిపిస్తే అక్కడి నుంచి పరుగో పరుగు. దాన్ని చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది, ఓ బామ్మ పడగవిప్పిన నాగుపామును ఒంటి చేత్తో పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లింది. అదేదో తాడును పట్టుకెళ్తున్నట్లు విషసర్పాన్ని లాక్కెళ్లింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన ఓ అటవీశాఖ అధికారి ట్విటర్‌లో ఈ వీడియోను పోస్టు చేస్తూ అవ్వా..! నాగుపాముతో అలా వ్యవహరించడం సరికాదు అని పేర్కొన్నారు. జనావాసాల్లోకొచ్చిన పెద్ద నాగుపామును, ఆ బామ్మ ఒంటి చేత్తో పట్టుకొని గబగబా నడుచుకుంటూ లాక్కెళ్లింది. దాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. ఇది ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. బామ్మ ధైర్యానికి మెచ్చుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఇది పోస్టు చేసిన రెండు గంటల్లోనే 15 వేల మంది వీక్షించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని