హైదరాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్‌

ఎయిర్‌ ఏషియాకు చెందిన ఫ్లైట్‌ 15 1825 విమానం మంగళవారం హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. చండీగఢ్‌

Updated : 26 May 2020 17:54 IST

హైదరాబాద్‌: ఎయిర్‌ ఏషియాకు చెందిన ఫ్లైట్‌ i51543 విమానం మంగళవారం హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. జైపూర్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎయిర్‌ ఏషియాకు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 76మంది ప్రయాణికులతో వస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసినట్లు ఎయిర్‌ ఏషియా తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది. అదేవిధంగా సమస్యకు కారణాన్ని కూడా అన్వేషించనున్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని