ఏపీ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులను అమరావతి తరలించేందుకు వీలుగా తెలంగాణ సర్కారు ప్రత్యేక బస్సులకు అనుమతి ఇచ్చింది....

Updated : 27 Aug 2021 20:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులను అమరావతి తరలించేందుకు వీలుగా తెలంగాణ సర్కారు ప్రత్యేక బస్సులకు అనుమతి ఇచ్చింది. తమ ఉద్యోగులను తరలించేందుకు ప్రత్యేక బస్సులకు అనుమతివ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని లేఖ రాశారు. సుమారు 400 మంది ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బస్సులకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అనుమతినిచ్చింది. తొలిదశలో 250 మందిని తరలించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఒక ఏసీ బస్సుతోపాటు మిగిలినవి సూపర్‌ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్‌ నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ బస్సులు బయల్దేరనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని