కలుషిత ఆహారం తిని 22మందికి అస్వస్థత

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌నాయక్‌ తండాలో కలుషిత ఆహారం తిన్న 22మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఓ కుటుంబంలో స్థానిక సంప్రదాయ పూజ(దసరా) నిర్వహించారు. ఈ

Updated : 27 May 2020 17:14 IST

విషమంగా ముగ్గురు చిన్నారుల పరిస్థితి

ఉట్నూరు‌ గ్రామీణం: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌నాయక్‌ తండాలో కలుషిత ఆహారం తిన్న 22మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఓ కుటుంబంలో స్థానిక సంప్రదాయ పూజ(దసరా) నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి సమర్పించిన నైవేద్యాన్ని బుధవారం ఉదయం ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కల వారు ప్రసాదంగా స్వీకరించారు. ఆ ప్రసాదం తిన్న కొద్ది గంటల వ్యవధిలోనే దాదాపు 22 మందికి వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన వారిని ఉట్నూరు‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఏడుగురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నారు. వారిలో చిన్నారులు రిషిత(3), నైనక్‌(2), సూరజ్‌(3)ల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఉట్నూరు ఆర్డీవో వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని