ఆసుపత్రే ఆ జంటను కలిపింది

కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్న ఎన్నో జంటల ఆశలను కరోనా మహమ్మారి ఆవిరిచేసింది.

Published : 29 May 2020 03:24 IST

వైద్యుడు, నర్సుకి వివాహం

 

లండన్: కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్న ఎన్నో జంటల ఆశలను కరోనా మహమ్మారి ఆవిరిచేసింది. ఇలాగే ఆగష్టులో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు జాన్‌ టిప్పింగ్, అన్నలన్‌ నవరత్నమ్‌ జంట. ఈ కరోనా కాలంలో ఉత్తర ఐర్లాండ్, శ్రీలంకలో ఉన్న తమ తల్లిదండ్రులను లండన్‌కు తీసుకురావడం అంత సురక్షితం కాదనుకున్నారు. దాంతో వారు వైద్యసేవలు అందిస్తున్న ఆసుపత్రి సమక్షంలోనే అనుకున్న తేదీ కంటే ముందుగానే వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఆ ఆసుపత్రికి చెందిన చర్చిలో వారి వివాహం జరిగిందని వెల్లడిస్తూ..ఆ  వేడుకకు సంబంధించిన చిత్రాలను అక్కడి యాజమాన్యమే తాజాగా ట్విటర్‌లో షేర్ చేసి, అభినందనలు తెలిపింది. దాంతో ఆ ఫొటోలు ఒక్కసారిగా నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. వాటిన చూసిన నెటిజన్లు వారిది ముచ్చటైన జంట అంటూ అభినందనలు తెలిపారు.
ఈ వివాహంపై జాన్ టిప్పింగ్ మాట్లాడుతూ.. . మేం పనిచేసే దగ్గరే పెళ్లి చేసుకోవడం కాస్త వింతగా అనిపించినా, ఆ వేడుక ఆనందంగా ఉందన్నారు. ‘ఆమెకు నా ప్రేమను వెల్లడించినప్పుడే మేం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మేం ఒక్కటి కావడానికి మా ఆసుపత్రి యాజమాన్యం మద్దతు ఇచ్చింది’ అని పెళ్లి కొడుకు నవరత్నమ్ వెల్లడించారు. కాగా, 
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి మార్చి 23 నుంచి బ్రిటన్‌ లాక్‌డౌన్ విధించింది. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని