మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి

గోదావరి జలాలను అరకిలోమీటరు ఎత్తుకు తీసుకెళ్లి లక్షలాది ఎకరాలను తడపాలన్న కల సాకారమయ్యింది. వేద పండితుల మత్రోచ్ఛారణల మధ్య సుదర్శన

Updated : 29 May 2020 19:35 IST

గజ్వేల్‌: గోదావరి జలాలను అరకిలోమీటరు ఎత్తుకు తీసుకెళ్లి లక్షలాది ఎకరాలను తడపాలన్న కల సాకారమైంది. వేద పండితుల మత్రోచ్ఛరణల మధ్య సుదర్శన యాగం నిర్వహించిన అనంతరం త్రిదండి చినజీయర్‌ స్వామితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభించారు. పంప్‌ హౌస్‌ స్విచ్చాన్‌ చేసిన వెంటనే గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌లోకి చేరుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని