కొవిడ్‌ శాంపిళ్లు ఎత్తుకెళ్లిన కోతులు

కరోనా వైరస్‌ విజృంభిస్తు్న్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లను ఓ కోతుల గుంపు....

Updated : 22 Dec 2022 17:13 IST

భయాందోళనలో స్థానికులు

మేరఠ్‌ (యూపీ): కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లను ఓ కోతుల గుంపు ఎత్తుకెళ్లింది. మేరఠ్‌లోని మెడికల్‌ కళాశాల ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ముగ్గురు కొవిడ్‌-19 అనుమానితుల నుంచి శాంపిళ్లు తీసుకుని వెళుతుండగా ల్యాబ్‌ టెక్నీషియన్‌పై కోతుల గుంపు దాడి చేసింది. అతడి చేతిలో ఉన్న శాంపిళ్లను ఎత్తుకెళ్లాయి. వాటిని కోతులు తమ వెంటే పట్టుకెళ్లడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ గుంపులోని ఓ కోతి శాంపిళ్లను నోటితో పీల్చడం కనిపించింది. దీంతో కోతులకు కూడా కరోనా సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు ఆ శాంపిళ్లను కోతులు పట్టుకెళ్లడంతో స్థానికులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. వాటి వల్ల కరోనా వైరస్‌ ఎక్కడ సోకుతోందనని భయపడుతున్నారు.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మెడికల్‌ కళాశాల సూపరింటిండెంట్‌ డాక్టర్‌ ధీరజ్‌ బాల్యన్‌ తెలిపారు. దీనిపై అటవీ అధికారులకు తెలియజేసినా వారు  కోతులను పట్టుకోలేదని తెలిపారు. మరోవైపు శాంపిళ్లను ఎత్తుకెళ్లడంతో అనుమానితుల నుంచి మరోసారి శాంపిళ్లను సేకరించారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని