తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలపై క్లారిటీ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో వాయిదా పడిన డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. తుది సెమిస్టర్‌ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని యూనివర్సిటీలకు

Published : 29 May 2020 19:34 IST

మార్గదర్శకాలు జారీ చేసిన ఉన్నత విద్యామండలి


 

హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో వాయిదా పడిన డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. తుది సెమిస్టర్‌ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని యూనివర్సిటీలకు సూచించింది. డిగ్రీ, పీజీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు జూన్‌ 20 నుంచి పరీక్షలు నిర్వహించవచ్చని విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యామండలి అనుమతి ఇచ్చింది. మిగతా సెమిస్టర్లకు నవంబర్‌ లేదా డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని సూచించింది. పరీక్షా సమయాన్ని రెండు గంటలకు కుదించాలని.. ప్రశ్నాపత్రంలోనూ ఎక్కువ ఐచ్ఛికాలు ఇవ్వాలని తెలిపింది. అన్ని సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే తాత్కాలికంగా ప్రమోట్‌ చేయాలని సూచించింది. ప్రాజెక్టులు, సెమినార్లు, వైవాలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని