గాలి ప్రసరణ లేని గదులతో కరోనా ముప్పు

గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్లు, కార్యాలయాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ముప్పు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా...

Updated : 30 May 2020 08:44 IST

లండన్‌: గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్లు, కార్యాలయాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ముప్పు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో ఈ విషయంపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూకేలోని సర్రే యూనివర్సిటీ పరిశోధకుడు ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఈ వివరాలను ఎన్విరాన్‌మెంటల్‌ ఇంటరాక్షన్‌ జర్నల్‌లో ప్రచురించారు. మనుషుల నిశ్వాస, తుమ్ము, దగ్గుల ద్వారా బయటకు వెలువడే సూక్ష్మ బిందువుల్లో నుంచి నీరు క్రమంగా ఆవిరైపోతుందని, వైరస్‌ కణాలు మాత్రం ఆ పరిసరాల్లోనే ఉండిపోతాయని పేర్కొన్నారు. అన్ని ప్రాంగణాల్లో ఇప్పుడు ఏసీలు ఉంటున్నప్పటికీ.. వాటి పనితీరు సమర్థంగా లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని తెలిపారు. అందువల్ల గదులలో గాలి వెలుతురు ధారాళంగా ఉండేలా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని